ఇంగ్లండ్ ఆలౌట్.. టీమిండియాపై భారీ ఆధిక్యత సాధించిన ఆతిథ్య జట్టు

  • తొలి ఇన్నింగ్స్ లో 432 పరుగులు చేసిన ఇంగ్లండ్ 
  • 354 పరుగుల ఆధిక్యతను సాధించిన ఇంగ్లండ్
  • నాలుగు వికెట్లు తీసిన షమీ
లీడ్స్ లో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు 432 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్ పై తొలి ఇన్నింగ్స్ లో 354 పరుగుల ఆధిక్యతను సాధించింది. మూడో రోజును 423/8 స్కోరుతో ప్రారంభించిన ఇంగ్లండ్ మరో 9 పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో షమీకి నాలుగు వికెట్లు దక్కగా, బుమ్రా, సిరాజ్, జడేజాలు చెరో రెండు వికెట్లు  తీశారు.

కాసేపటి క్రితం ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్స్ ను రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ప్రారంభించారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 7 ఓవర్లకు 13 పరుగులు. రోహిత్ 8, రాహుల్ 5 పరుగులతో ఆడుతున్నారు. భారత్ 341 పరుగులు వెనుకబడి ఉంది.

Team India
England
Test Match
Score

More Telugu News